ప్రియా భవానీ ప్రేమలేఖ

నటి ప్రియా భవానీశంకర్‌ తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ లాంటిది తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇటీవల వార్తల్లో ఉంటుంన్న నటి ప్రియా భవానీశంకర్‌. అందుకు కారణం దర్శకుడు, నటుడు ఎస్‌జే.సూర్యతో ప్రేమాయణం అనే వదంతులు రావడమే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సక్సెస్‌పుల్‌ కథానాయికిగా రాణిస్తోంది. మేయాదమాన్‌తో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీశంకర్‌ ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌ 2 చిత్రంలో నటించే స్థాయికి చేరుకుంది. 

కాగా ఈ మధ్యలో ఎస్‌జే.సూర్యతో కలిసి మాన్‌స్టర్‌ చి త్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది. తాజా గా బొమ్మై అనే మరో చిత్రంలో ఆయనతో జత కట్టింది. దీంతోనే వీరి మధ్య ప్రేమ సాగుతోందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై నటుడు ఎస్‌జే.సూర్య క్లారిటీ ఇచ్చారు. ప్రియా భవానీశంకర్‌ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా సామాజిక మాధ్యమాలు వారి గురించి వదంతులు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. తాజాగా నటి ప్రియా భవానీశంకర్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తన ప్రేమికుడు రాజ్‌కు ప్రేమలేఖ రాసింది. 







అందులో ‘పదేళ్ల క్రితం కళాశాలలో చాలా సంతోషంగా, ఆత్మస్థైర్యంతో చాలా ఓ మాదిరి అందం కలిగిన నన్ను నువ్యు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపడలేదు. ఇప్పటికీ అన్నింటినీ దాటి ఇంకా నాతో ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.  పగిలిన భావాలను సేకరించుకుంటున్న ఒకరితో  ఉండడం అంత సంతోషాన్నివ్వదు. నువ్వు నేను వినడానికి మరిచిన సంగీతం లాంటి వారం. గాయాలను మరచిపోవడానికి కొత్త ప్రేమను విమర్శించనవసరం లేదు. పరిస్థితులకు మారని అభిమానం చాలు. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి వాడు ఒకడు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్రమే సూర్యుడివి. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. అంతేకాకుండా తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటో సహా ఈ అమ్మడు ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్న ఈ ప్రేమలేఖ ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా లైక్స్‌ రావడం విశేషం.